అంతులేని కధ – మన రెవెన్యు శాఖ
ఉయ్యూరు
ఈ మధ్య నేను టివిలో సినిమా చూసా. అది అంతులేని కధ. సినిమాకు తగ్గ టైటిల్ రచయిత పెట్టి సిని ప్రేక్షకులను మెప్పించాడు. అలానే రెవెన్యూశాఖ అవినీతిలో అందవేసిన చేయి అనిపించుకుంది. ఏ శాఖలో లేని ప్రజా సంబంధాలు ఈ శాఖలోనే ఎక్కువగా ఉంటాయి. మండల స్థాయి నుండి జిల్లా,రాష్ట్ర స్థాయి అంతర్భాగమైన రెవెన్యూ శాఖ అన్ని స్థాయిలలో అవినీతి కధలకు అంతులేకుండా వినిపిస్తున్నాయి. విడివిడిగా ప్రతి మండల,జిల్లా కేంద్రాలలో ప్రజలను మాముళ్ళతో పట్టి పిడిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. వాటిని ప్రక్షాళన చేయాలిసిన వారే వారికి అండగా నిలుస్తునారేనిది వాస్తవం కాదా ?
అయినా అదికారం కేంద్రికృతమయే శాఖ కాబట్టి దీనికి వెయిటేజీ యధాతధంగా కొనసాగుతుంది. ఓ టైటిల్ డిడ్ కావాలన్నా, రేషన్ కార్డ్ లో పేరు మార్పు, చిరునామా మార్పు, ఇంకా కుల ధ్రువీకరణ, నేటివిటి సర్టిఫికెట్లు వంటి పలురకాల సేవలకు నిర్ధారిత ధరలు లేకుండా జారీ కావడం లేదు. ఎంత ఆన్లైన్లో చేసినా తోదరగా సేవ కావాలనుకునే వారందరూ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళుతూనే ఉన్నారు.
అందువల్ల అవసరానికి సరిపడే సొమ్ము చెల్లించి మరీ సర్టిఫికెట్ తిసుకేల్లుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి కీలకమైన ఈ శాఖని ప్రతి ఉద్యోగి తానూ పదవీ విరమణ చేసినప్పటికీ మంచి హొదా తో కూడిన జీతాన్ని అనుభవిస్తున్నారు. ఎసిబి కినుక వహించకుండా మండల స్థాయి నుండి…